- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బామ్మ గెటప్‌లో దర్శనమిచ్చిన బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.. నీ ఒరిజినల్ లుక్ ఇదేగా అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ ద్వారా చాలా ఫేమస్ వారిలో అషు రెడ్డి ఒకరు. అలా ఫేమ్ తెచ్చుకున్న ఈ భామ.. నితిన్ హీరోగా మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో నటించి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఆ అమ్మడుకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అలా అక్కడ తన ఆటతో ఆకట్టుకున్నప్పటికీ ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. ఇక హౌస్‌నుంచి బయటికి వచ్చాక బుల్లితెరపై రియాల్టీ షోలు చేస్తూ మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత డైరెక్టర్ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది.
అంతేకాకుండా ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆషు రెడ్డి తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బామ్మా గెటప్‌లో రెడీ అయి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అషు రెడ్డి పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు నీ నేచురల్ లుక్ ఇదేగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీ ఫ్యామిలీ స్టార్ అనే షోలో చేస్తుంది. ఆ షో కోసమే ఇలా బామ్మ గెటప్ వేసినట్లుగా తెలుస్తోంది.