Srilanka: శ్రీలంలో ప్రారంభమైన పోలింగ్.. బరిలో 8,800 మంది అభ్యర్థులు

by vinod kumar |
Srilanka: శ్రీలంలో ప్రారంభమైన పోలింగ్.. బరిలో 8,800 మంది అభ్యర్థులు
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక పార్లమెంట్ (Srilanka Parliment) ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభమైంది. 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. దేశంలో మొత్తం 225 పార్లమెంటు స్థానాలుండగా 8,800 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. అధ్యక్షుడు దిసనాయకే (Dishanayake) నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్(NPP) పార్టీకి ఈ ఎన్నికలు కీలకంగా నిలవనున్నాయి. ఎందుకంటే తన విధానాలు అమలు జరగాలంటే పార్లమెంటులో మెజారిటీ ఉండాలని దిసనాయకే భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌పీపీకి పార్లమెంటులో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. సెప్టెంబరు 23న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒక రోజు తర్వాత ప్రెసిడెంట్ దిసానాయకే పార్లమెంటును రద్దు చేశారు. అయితే తన ఎజెండాకు మద్దతు ఇవ్వడానికి కొత్త పార్లమెంటులో మెజారిటీ ఉండాలని విశ్వసిస్తున్నారు.

ప్రతిపక్షాల పరిస్థితి దారుణంగా ఉందని, దిసనాయకే పార్టీ విజయం సాధించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస (Sajith Premadasa) ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ పన్ను తగ్గింపు హామీలను నెరవేర్చేలా దిసానాయకేపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారోననే ఉత్కంఠ నెలకొంది. అయితే గత ప్రభుత్వంతో సంబంధం ఉన్న 60 మందికి పైగా సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, గోటబయ రాజపక్సే, మహింద రాజపక్సే వంటి ప్రముఖ నాయకులు పోటీకి దూరంగా ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed