బాసర ట్రిపుల్ ఐటీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా డాక్టర్ రాజేష్..

by Sumithra |
బాసర ట్రిపుల్ ఐటీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా డాక్టర్ రాజేష్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విద్యార్థినుల వరుస ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాసర ఆర్జీయూకేటీ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా డాక్టర్ డి.రాజేశ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ కు చెందిన ఆయన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. అనంతరం మెదక్ డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం ఆర్జీయూకేటీ బాసరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమితులయ్యారు. గతంలో రాజేష్ ఆర్మూర్ డివిజన్ లోని పలుపోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా పని చేసిన ఆయన ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించారు.

విధి నిర్వహణలో ముక్కు సూటి తత్వంతో పోలీస్ శాఖలో ఉన్నతాధికారులతో, రాజకీయ నాయకులతో పలుసమస్యలెదుర్కొన్నా ఎక్కడా తలొగ్గక తను నమ్మిన సిద్ధాంతంతో పనిచేసే అధికారిగా డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి పేరుంది. ఫ్రెండ్లీ పోలీస్ కు నిలువెత్తు నిదర్శనంగా ఉండే ఆయన శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని హ్యాండిల్ చేయడంలో సింగం లా వ్యవహరిస్తారు. ఆర్జీయూకేటీకి ఉన్నతాధికారులు సరైన అధికారిని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వర్సిటీ వీసీ గోవర్ధన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి పాల్గొన్నారు.

Advertisement

Next Story