- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?
దిశ, సినిమా: హీరోయిన్ మమతా మోహన్ దాస్(Mamata Mohandas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘యమదొంగ’(Yamadonga) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈ మూవీలో ఓలబ్బయ్యో అంటూ యంగ్ ఎన్టీఆర్‌తో కలిసి యాక్టింగ్ అదరగొట్టేసింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘కృష్ణార్జున’(Krishnarjuna), ‘హోమం’(Homam), ‘రుద్రంగి’(Rudrangi), ‘మహారాజ’(Maharaja), ‘చింతకాయల రవి’(Chintakayala Ravi), ‘కింగ్’(King) లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈమెను క్యాన్సర్ కబలించింది. ఆ మహమ్మారిని ఎదుర్కొని ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది. అలా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇటీవలే హీరో జగపతి బాబు(Jagapathi Babu) నటించిన ‘రుద్రాంగి’(Rudrangi) సినిమాలో కనిపించింది. ఇందులో తన అద్భుతమైన నటనతో మంచి ప్రశంసలు అందుకుంది. అలా అనారోగ్యం కారణంగా కమిలిపోకుండా ఆ వ్యాధితో పోరాడి నేడు సినిమాలు చేస్తూ చాలా మందికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.