Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

by Y.Nagarani |
Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్నవారికి 3 గంటల్లో దర్శనం లభిస్తుందని వెల్లడించింది. నిన్న 66,449 మంది స్వామివారిని దర్శించుకోగా.. 20,639 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. కానుకల రూపంలో హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) సతీసమేతంగా తిరుమలకు విచ్చేశారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. స్వామివారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. దేశం కోసం, ఢిల్లీ ప్రజల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story