- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Posani Krishna Murali: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. పాలిటిక్స్‌కు పోసాని కృష్ణమురళి గుడ్‌బై
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ (YCP) నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నట్లుగా ప్రకటించారు. ఇక నుంచి పాలిటిక్స్ (Politics) జోలికి వెళ్లబోననని ఆయన వెల్లడించారు. అదేవిధంగా రాజకీయాలపై కూడా ఎన్నడూ మాట్లాడబోనని స్టేట్‌మెంట్ ఇచ్చారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదని తెలిపారు. ఏ పార్టీని అయినా తాను సామన్య ఓటరులాగే ప్రశ్నించానని.. మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్ చేశానని అన్నారు. తన చివరి శ్వాస వరకు కుంటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కాగా, వైసీపీ మద్దుతుదారుడైన పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)పై ఇటీవలే ఏపీ సీఐడీ (AP CID) కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత (Andhra Pradesh Telugu Yuvatha) ప్రతినిధి బండారు వంశీకృష్ణ (Bandaru Vamsi Krishna) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ (AP CID) అధికారులు ఆయపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో ఓ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) మీడియాలో మాట్లాడారని వంశీకృష్ణ (Vamsi Krishna) ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోసానిపై 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం ఏపీ సీఐడీ (AP CID) కేసు నమోదు చేసింది.