Manipur: మణిపూర్ అంతటా ‘అఫ్సా’ విస్తరించాలి.. కుకీ ఎమ్మెల్యేల డిమాండ్

by vinod kumar |
Manipur: మణిపూర్ అంతటా ‘అఫ్సా’ విస్తరించాలి.. కుకీ ఎమ్మెల్యేల డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ను రాష్ట్రం మొత్తం విస్తరించాలని మణిపూర్‌లోని కుకీ ఎమ్మెల్యే (Kukee Mlas)లు డిమాండ్ చేశారు. దోపిడీకి గురైన ఆయుధాలను రికవరీ (Arms Revovery) చేసేందుకు ఇంది ఎంతో అవసరమని తెలిపారు. ఈ మేరకు10 మంది కుకీ శాసనసభ్యులు గురువారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14న పలు ప్రాంతాల్లో అఫ్సా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తద్వారా మిగిలిన 13 పోలీసు ప్రాంతాలకు ఈ చట్టాన్ని విస్తరించొచ్చని పేర్కొన్నారు. గతేడాది మే 3 నుంచి జరిగిన అల్లర్లలో మిలిటెంట్లు (Militants) దోచుకున్న 6000కు పైగా ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఈ చర్య ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు రాజకీయ చర్చలు ప్రారంభించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఐదుగురు బీజేపీ, ఇద్దరు జేడీయూ(JDU), మిగతా ముగ్గురు కుకీ తెగకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, మణిపూర్‌లోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అఫ్సా చట్టాన్ని విధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story