- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DEO : వివాహేతర సంబంధం..భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన డీఈవో
దిశ, నల్లగొండ బ్యూరో : జిల్లా విద్యాధికారి(DEO)గా అందరికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే అడ్డదారి తొక్కాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం(extramarital affair) పెట్టుకొని భార్య(wife)కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా విద్యాధికారి(DEO) భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చంది. భిక్షపతి ప్రవర్తనపై నిఘా వేసిన భార్య అతను మరో మహిళతో ఉండగా కుటుంబ సభ్యులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భిక్షపతిని నిలదీయగా ఆమెను ఇంటి నుంచి బయటకు పోమ్మంటూ బెదిరించాడు. తనను పెళ్లి చేసుకుని వదిలేసి, 14ఏండ్లుగా తన పలుకుబడితో కోర్టులో విడాకుల కేసు నడిపిస్తూ , మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. గతంలో మరో మహిళతోనూ ఇలాగే వ్యవహరించాడని, ఇప్పుడు ఇంకో మహిళను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడని భిక్షపతి భార్య ఆరోపించింది.
భిక్షపతి తనకు చేస్తున్న అన్యాయంపై పోలీసులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. నాకు తెలియకుండా ప్రియురాలితో ముగ్గురు పిల్లలను కూడా కన్నాడని ఆరోపించింది. ఈ మేరకు భిక్షపతి భార్య నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా భిక్షపతి వ్యవహారంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా ఉపాధ్యాయులపై కూడా భిక్షపతి లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు గతంలో చోటుచేసుకున్నాయి. తనకు లొంగకుంటే వేదింపులకు గురిచేసి సస్పెండ్ చేస్తారని భిక్షపతి పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రాజకీయ పలుకుబడితో నల్గొండలోనే డీఈవోగా ఏళ్లుగా తిష్టవేసిన భిక్షపతిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.