- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
దిశ, ఘట్కేసర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, మేడ్చల్ మల్కాజిరి జిల్లా ఆధ్వర్యంలో మైనారిటీ యువత (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఫార్శీయులు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్-2 సర్వీసెస్ పరీక్ష కోసం రెండు ఫ్రీ ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిరి జిల్లా మైనారిటీస్ సంక్షేమశాఖ అధికారి గురువారం తెలిపారు. దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 29వ తేదీ ఆఖరి గడువని తెలిపారు.
ఈ మాక్ టెస్టు డిసెంబర్ 2, 3, 9, 10వ తేదీలలో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ పరీక్ష కోసం మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష కోసం అప్లై చేసుకున్న మైనారిటీ యువతీ యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ & కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్, 3వ అంతస్తు, జామియా నిజామియా కాంప్లెక్స్, గన్ఫౌండ్రి, అబిడ్స్, హైదరాబాద్ లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, మేడ్చల్ మల్కాజిరి జిల్లా 2వ ఫ్లోర్, ఐడాక్ కాంప్లెక్స్, అంతాయిపల్లి, శామీర్పేట ఫోన్ నెం: 9492037940/9000168256 కు సంప్రదించాలని సూచించారు.