- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bonded Labour : వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణాపై ‘సుప్రీం’ సీరియస్.. కీలక ఆర్డర్స్
దిశ, నేషనల్ బ్యూరో : అప్పులు తిరిగి చెల్లించలేక వెట్టిచాకిరీ చేస్తున్న కార్మికులు(Bonded Labour) నేటికీ దేశంలో ఉండటంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. వెట్టిచాకిరీ నుంచి ఎంతోమందికి రాష్ట్రాల కార్మిక శాఖలు విముక్తి కల్పిస్తున్నప్పటికీ.. వారిలో చాలామందికి సత్వర ఆర్థిక సహాయాన్ని అందించడం లేదని పేర్కొంది. దీనిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్.గవాయి సారథ్యంలోని ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. అప్పుల వల్ల వెట్టిచాకిరీ చేస్తున్న కార్మికులకు సంబంధించి బిహార్‌కు చెందిన సురేంద్ర మాంఝీ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కలిపి దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.
ఆ డబ్బులు ఇంకా ఎప్పుడిస్తారు ?
ఉత్తరప్రదేశ్‌లో 5,264 మంది వెట్టి చాకిరీ కార్మికులను అధికారులు రక్షించగా, వారిలో 1,101 మందికే ఆర్థికసాయం అందిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) తరఫు న్యాయవాది వంశజ శుక్లా కోర్టుకు తెలిపారు. ‘‘బిహార్‌లో 467 మంది బాలలను రక్షించారు. వారిలో 245 మంది అప్పుల వల్ల వెట్టిచాకిరీ చేస్తుండగా అధికారులు కాపాడారు. మిగతా బాలలను మానవ అక్రమ రవాణా గ్యాంగులు తరలిస్తుండగా స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ చేశాయి’’ అని ఆయన చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘‘యూపీలో వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందిన మరో 4,167 మంది కార్మికులకు ఆర్థికసాయం అందాల్సి ఉంది. ఆ డబ్బులు ఇంకా ఎప్పుడిస్తారు ?’’ అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘‘బాలల అక్రమ రవాణా ఆందోళన కలిగించే అంశం. ఇటువంటి అంశాలపై కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడి ప్రణాళికతో కలిసికట్టుగా పనిచేయాలి. బాలల అక్రమ రవాణాను ఆపేందుకు, వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందిన వారికి ఆర్థికసాయం మంజూరుకు, రుణమాఫీ పత్రాల జారీకి ఎలాంటి విధి విధానాలను అవలంభించాలనే దానిపై చర్చించేందుకు రాష్ట్రాలు, యూటీలతో సమావేశం నిర్వహించండి’’ అని కేంద్ర కార్మిక శాఖకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.