Etala Rajenderమత్స్యకారులకు పొలిటికల్ సపోర్ట్ లేదు: ఈటల రాజేందర్

by Y. Venkata Narasimha Reddy |
Etala Rajenderమత్స్యకారులకు పొలిటికల్ సపోర్ట్ లేదు: ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మత్స్యకారుల(Fishermens)కు పొలిటికల్ సపోర్ట్ లేకుండా పోయిందని, వారిని కేవలం ఓట్ల సమయంలో వాడుకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender)పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవానికి ఈటల హాజరై మాట్లాడారు. మత్స్యకారులు ఇంత జనాభా ఉన్నప్పటికీ రాజకీయపరంగా తమను ఏ పార్టీ ప్రోత్సహించడం లేదన్నారు. రాజకీయంగా ఇప్పుడు ఉన్న వారంతా స్వతహాగా ఎదిగిన వారే తప్ప ఎవరూ గుర్తించినవారు కాదన్నారు. యాదవులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు వృత్తిలో ఉంటే సభ్యత్వం వస్తుందని, కానీ వృత్తిలో ఉండి కూడా సభ్యత్వం పొందని జాతి మత్స్యకారులని ఆయన పేర్కొన్నారు.

సహకార వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ అందిస్తున్నాయని, అందరూ సహకార సంఘాలుగా ఎదిగి ముందుకు పోవాలని సూచించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో ఎంపీలకు మెంబర్షిప్ ఉంటుందని, తాను సభ్యత్వం అడిగి తీసుకున్నానని గుర్తుచేశారు. ఢిల్లీలో ఎన్ఎఫ్‌డీసీ బోర్డుకు కొంతమందిని తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. సభ్యత్వాలు పాత సొసైటీ తీర్మానం చేస్తేనే ఇస్తామనే పద్ధతి కాకుండా మత్స్య సంపదనే నమ్ముకుని బతికే వారికి ఎలాంటి నిబంధనలు లేకుండా సభ్యత్వం ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. ఎల్ఎండీ, మల్లన్న సాగర్‌లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పెడతామంటే వాటిని ఆపటానికి ఎంతో స్ట్రగుల్ చేసినట్లు గుర్తుచేశారు.

Advertisement

Next Story