CM Revanth Reddy : రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2024-11-24 11:23:29.0  )
CM Revanth Reddy : రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) రేపు ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సమావేశం అయ్యేందుకు సోమవారం ఉదయం సీఎం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉత్సవాలకు హాజరుకావాలని ఏఐసీసీ(AICC) పెద్దలను కోరనున్నట్లు సమాచారం. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు హాజరుకావాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్‌ పదవులు, మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story