విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక అడుగులు

by srinivas |   ( Updated:2024-11-24 11:07:40.0  )
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక అడుగులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రైల్వే జోన్(Visakha Railway Zone) ఏర్పాటుకు కీలక అడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయాన్ని నిర్మించేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway Office) జోన్ ఆఫీసు 9 అంతస్థుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. రెండు సెల్లార్ల పార్కింగ్‌తో కలిపి మొత్తం 11 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు.. ఈ మేరకు రైల్వే జోన్ కార్యాలయానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్(Railway Minister Ashwini Vaishtav) ఎక్స్ వేదికగా వెల్లడించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే 2014-19 సమయంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కొంతమేర అడుగులు పడ్డాయి. కానీ 2019-2024 వరకు ఎలాంటి అడుగులు ముందుకుపడలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. దీంతో రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ స్పీడందుకుంది. విశాఖ రైల్ జోన్ కార్యాయాన్ని నిర్మించేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా టెండర్లు ఆహ్వానించింది. దీంతో విశాఖ వాసుల కల సాకారానికి కీలక అడుగులు పడ్డాయి.

Advertisement

Next Story