- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Adani: అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ఆరోపణల నేపథ్యంలో గౌతమ్ అదానీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. దేశంలో ప్రధాన విమానాశ్రయంపై నియంత్రణను అదానీ గ్రూప్‌నకు అప్పగించాలని భావిస్తున్న కెన్యా ప్రభుత్వం దానిపై వెనకడుగు వేసింది. గౌతమ్ అదానీపై కేసు నమోదైన కారణంగా ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్టుతో పాటు విద్యుత్ సరఫరా లైన్‌ల కాంట్రాక్టును కూదా రద్దు చేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో గురువారం స్పష్టం చేశారు. కెన్యాలోని ప్రధాన విమానాశ్రయం జోమో కెన్యాట్టాను అభివృద్ధి చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైంది. దీనిపై అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వినిపించింది. నిరసనలు కూడా వెళ్లువెత్తాయి. ఆందోళనల కారణంగా తాత్కాలికంగా ఒప్పందాన్ని పక్కకు పెట్టిన కెన్యా ప్రభుత్వం, తాజా అమెరికా కేసు నేపథ్యంలో మొత్తానికే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, కెన్యాలో విద్యుత్ సరఫరా కోసం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో అదానీ గ్రూప్‌తో 30 ఏళ్ల సుధీర్ఘ ఒప్పందం చేసుకుంది. దీని విలువ 736 మిలియన్ డాలర్లు. ఇప్పుడు దీన్ని కూడా రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.