- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gautam Adani: రూ. లక్ష కోట్లు కోల్పోయిన గౌతమ్ అదానీ
దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా సగానికి పైగా సంపదను కోల్పోయిన గౌతమ్ అదానీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. సోలార్ పవర్ కాంట్రాక్టుల వ్యవహారంలో అదానీ గ్రూప్ లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిందని అమెరికాలో కేసు నమోదైంది. దీంతో గురువారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. గౌతమ్ అదానీ సంపద సైతం ఒక్కరోజే 12 బిలియన్ డాలర్లు(రూ. లక్ష కోట్లకు పైనే) కోల్పోయారు. 2023లో హిండెన్‌బర్గ్ ఆరోపణల సమయంలో అదానీ సంపద క్షీణించిన తర్వాత ఆ స్థాయిలో మళ్లీ క్షీణించడం ఇదే మొదటిసారి. అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా 23.44 శాతం పతనమైంది. ఆ తర్వాత అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం, అదానీ గ్రీన్ 18 శాతం, అదానీ పోర్ట్స్ 13.23 శాతం, అదానీ సిమెంట్స్ 12 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం, అదానీ విల్మార్ 10 శాతం, అదానీ పవర్ 9 శాతం, ఏసీసీ 8 శాతం క్షీణించాయి. అన్ని కంపెనీలు బలహీనపడటంతో రూ. 2.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ పడిపోయింది. అదానీ సంపద 69.8 బిలియన్ డాలర్ల నుంచి 58.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనివల్ల ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో అదానీ 22వ స్థానం నుంచి 25వ స్థానానికి పడిపోయారు.