Tribal Welfare : నాణ్యతమైన భోజనాన్ని అందించాలి : గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎ. శరత్

by Y. Venkata Narasimha Reddy |
Tribal Welfare : నాణ్యతమైన భోజనాన్ని అందించాలి : గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎ. శరత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల్లో నాణ్యతతో కూడిన భోజనాన్ని పిల్లలకు అందించాలని గిరిజన సంక్షేమ(Tribal Welfare)శాఖ కార్యదర్శి ఎ.శరత్ (A. Sarath)ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, గిరిజన గురుకులాల ప్రిన్సిపాల్, వార్డెన్ లు, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారులు, ఆర్సీవోలు, ఇతర అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పిల్లలకు అప్పుడే వండిన సురక్షిత వేడి ఆహార పదార్థాలను వడ్డించాలని, సరుకుల నుంచి ఆహారం వడ్డించే వరకు నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. సరుకుల విషయంలో నాణ్యత లేకుంటే వాటిని తిరస్కరించాలన్నారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలల హస్టళ్లలో పనిచేస్తున్న వంటవారు, కామాటిలకు శుభ్రతపై శిక్షణ ఇవ్వాలన్నారు. పిల్లలకు ఎప్పుడు మంచినీటి తాగడానికి అందుబాటులో ఉంచాలన్నారు.

వంట చేసే పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చూసుకోవాలన్నారు. కూరగాయలు, పండ్లు, మాంసాహారము, గుడ్లు మొదలైన ఆహార పదార్థాలను నాణ్యత లేకుంటే తిరస్కరిండంతోపాటు వారిపై కేసులు బుక్ చేయాలన్నారు. హైదరాబాద్ గురుకులం హెల్త్ కమాండ్ సెంటర్ నుంచి పనితీరును తరచూ పరిశీలిస్తామని తెలిపారు. సెలవు రోజుల్లో, పాఠశాల తర్వాత ఉపాధ్యాయులకు డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు సంచాలకులు, విట్ట సర్వేశ్వర్ రెడ్డి, ట్రైకార్ జీఎం శంకర్ రావు, డీటీఆర్ఐ సముజ్వల, గిరిజన సంక్షేమ గురుకులం అదనపు కార్యదర్శి మాధవి దేవి, గిరిజన సంక్షేమ విద్య ఉప సంచాలకులు చందన పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed