పరిశ్రమ పెట్టి మా ప్రాణాలు తీస్తారా..?

by S Gopi |
పరిశ్రమ పెట్టి మా ప్రాణాలు తీస్తారా..?
X

దిశ, వెల్గటూర్: ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాశిగాం గ్రామస్తులు శుక్రవారం రాయపట్నం కరీంనగర్ రోడ్ ఎక్కి ధర్నా రాస్తారోకో చేశారు. పరిశ్రమ పెట్టి తమ ప్రాణాలు తీయొద్దని పురుగుల మందు డబ్బాలతో మహిళలు వరంగల్- రాయపట్నం రాష్ట్ర రహదారిపై మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఇథనాల్ పరిశ్రమ పెట్టి తమ ప్రాణాలు తీస్తారా అంటూ మంత్రి కొ ప్పల ఈశ్వర్ పై మండి పడ్డారు. తమ ప్రాణాలు పోయినా సరే వెనక్కి తగ్గేదిలేదని వందలాదిమంది రైతులు, మహిళలు ఆందోళనలో పాల్గొని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed