- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
30 ఏళ్లుగా మట్టి రోడ్డుపైనే ప్రయాణం.. మానేరుపై బ్రిడ్జి కలేనా?
దిశ, కాల్వశ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట, అలాగే చిట్యాల మండలంలోని బోర్నపల్లి గ్రామాల మధ్య ఉన్న మానేరుపై బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు, అలాగే కరీంనగర్‌లోని ఎల్ఎండీ డ్యాం గేట్లు తీసినప్పుడు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో మండల ప్రజలు అవస్థలు అన్ని ఇన్ని కావు. వర్షాలు వస్తే రాకపోకలు నిలిచిపోతాయి. వ్యవసాయ కూలీల కష్టాలు వర్ణనాతీతం గా ఉంటాయి. వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వ్యవసాయ పనుల కోసం వాగు దాటాల్సిన పరిస్థితి వస్తుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఇటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు, అటు వైపు వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి రాకపోకలకు ఎంతో సులభతరం అవుతుందని వ్యవసాయ కూలీలు అంటున్నారు.
పెద్దపెల్లి జిల్లాల ప్రజలు వరంగల్, భూపాలపల్లి కి చేరుకోవాలంటే కొన్ని కిలోమీటర్ల దూర ప్రయాణం తగ్గుతుంది. అలాగే వ్యవసాయ రైతులు వరంగల్‌లో ఉన్న మార్కెట్‌లో పత్తి, మిర్చి అమ్ముకోవాలంటే రైతులకు అనుగుణంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే రహదారి అనువుగా ఉంటుందని జిల్లాల ప్రజలు కోరుతున్నారు. భూపాలపల్లి జిల్లాకు పోవాలంటే ప్రత్యాయ మార్గం లేక, మంథని, కాటారం గ్రామాల నుండి వెళ్లాల్సి వస్తుందని, అధిక దూరం ప్రయాణం అవుతుందని, కనుక ఈ ప్రభుత్వంలో నైన ఈ రెండు జిల్లాలను కలిపే విధంగా బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఎమ్మెల్యేలు మారినా బ్రిడ్జి నిర్మించలే..
పెద్దపెల్లి నియోజకవర్గంలో 1994-1999 వరకు తెలుగుదేశం అభ్యర్థి బిరుదు రాజమల్లు, అలాగే 1999-2004 బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి చిన్నరాతుపల్లి, పెద్దరాత్‌పల్లి గ్రామాల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఆ తర్వాత 2004-2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కిష్టంపేట, బోర్నపల్లి గ్రామాల మధ్య మానేరుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతానే హామీ ఇచ్చారు. కానీ అతడు ఎన్నికల్లో ఓడిపోవడంతో బ్రిడ్జి కోసం ఆలోచన చేసిన నాయకుడే లేకపోలేదు. ఆ తర్వాత 2004-2009 ముకుందరెడ్డి గెలుపొందారు. 2009-2014 వరకు తెలుగుదేశం అభ్యర్థి చింతకుంట విజయరమణారావు గెలుపొందారు. అలాగే 2014-2019లో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గెలుపొందారు.
జిల్లాలో అభివృద్ధి పనులు ఎన్నో చేపట్టారు. అవార్డులు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జిల్లా, మండలాలు అభివృద్ధి దిశగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు 2014 లో గెలిచారు. గతంలో జిల్లా, మండల ప్రజలు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా అప్పుడు తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇచ్చినా కానీ పరిస్థితి అనుకూలించకపోవడంతో బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడలేదు. అయితే ప్రస్తుత ప్రజా ప్రభుత్వం లోనైనా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చొరవ చూపి ఈ బ్రిడ్జి నిర్మాణానికి పునాదులు వేయాలని జిల్లా, మండల ప్రజలు కోరుతున్నారు.
వాగులో మట్టి రోడ్డు..
కిష్టంపేట, బుర్నాపల్లి గ్రామాల ప్రజలు మానేరు వాగులో ప్రతి సంవత్సరానికి ఒక గ్రామం నిబంధనలు విధించుకుని ప్రజల సౌకర్యార్థం వాగులో మట్టి రోడ్డు ఏర్పాటు చేసి ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నారు. వాహనాలకు కొంత చొప్పున రుసుము వసూలు చేసినా ఈ రోడ్డు ఏర్పాటుతో దూరభారం కొంత తగ్గిందని పలువురు వాహనదారులు తెలుపుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతులు
ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ప్రజలు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఉమ్మడి జిల్లా రైతులు, పలు వ్యాపారాలు, కూలీలు వేడుకుంటున్నారు.
నిధులు మంజూరు చేయాలి
మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలి. వ్యవసాయ పనులు, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లే రైతులు, ప్రజలకు ఎంతో దోహదపడుతుంది. వరంగల్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల రహదారులను అనుసంధానం చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ నిధులు మంజూరు చేసి ఈ బ్రిడ్జిని శాశ్వతంగా నిర్మించాలి.:- రాగుల రాజ్‌కుమార్, గ్రామస్తుడు, కిష్టంపేట