ఫోర్జరీ కేసులో ఇద్దరి అరెస్ట్

by Disha Web Desk 23 |
ఫోర్జరీ కేసులో ఇద్దరి అరెస్ట్
X

దిశ,వీణవంక : వీణవంక మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి రోజుకొకటి బయటపడుతుంది. మండలంలోని మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దూలం రాజయ్య అనే వ్యక్తి తన అవసరాల నిమిత్తం తన రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన మేకల మోహన్ రెడ్డి, కొలిపాక రామ స్వామి లకు అమ్మి వారిద్దరికీ రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాడు. తన మామ భూమి అమ్మడం ఇష్టం లేని రాజయ్య మేనల్లుడు భూమిని కాజేయాలని దురుద్దేశంతో గతంలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి, ధరణి ఆపరేటర్ అరుణ్ చౌదరితో లోపాయి గారి ఉప్పదం ఒప్పందం కుదుర్చుకున్నారు.

రెండు లక్షల రూపాయలు బేరం మాట్లాడుకుని మోహన్ రెడ్డికి రామస్వామి లకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఇవ్వకుండా మళ్ళీ వేలి ముద్రలు వేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ వస్తుందని మోసపూరితమైన మాటలు చెప్పి వారిద్దరి వేలిముద్రలు తీసుకుని స్వామికి రెండున్నర ఎకరాల భూమిని పట్టా చేశారు.మేకల మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ధరణి ఆపరేటర్ అరుణ్ చౌదరి బోoగోని స్వాములను అరెస్టు చేసామని మిగతా నేరస్తులు పరారీలో ఉన్నారని ఎస్సై తిరుపతి తెలిపారు. అయితే గతంలో పనిచేసిన డీటీ శ్రీనివాస్ రెడ్డి, ధరణి ఆపరేటర్ అరుణ్ చౌదరిలు కలిసి ఒక కుటుంబానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసిన విషయంలో ఇద్దరు సస్పెండ్ కు గురయ్యారు.



Next Story

Most Viewed