స్మెల్ చూశా.. ముద్దు పెట్టుకున్నా.. అప్పుడే నాకు కావాలని డిసైడ్ అయ్యా..గ్లోబల్ హీరో స్పీచ్ వైరల్

by Dishafeatures3 |
స్మెల్ చూశా.. ముద్దు పెట్టుకున్నా.. అప్పుడే నాకు కావాలని డిసైడ్ అయ్యా..గ్లోబల్ హీరో స్పీచ్ వైరల్
X

దిశ, సినిమా : ఆస్కార్ అవార్డు.. ప్రతీ నటుడి డ్రీమ్. కానీ చేరుకోవడం చాలా కష్టం. ప్రపంచ దేశాల సినిమాలన్నీ ఈ అకాడమీ అవార్డు కోసం పోటీ పడుతుండగా.. దాన్ని అందుకోవడం నిజంగా గగనమే. ఈ నేపథ్యంలో ఈ ఫీట్ సాధించిన జాకీ చాన్.. అవార్డు అందుకున్న వేళ ఇచ్చిన స్పీచ్, చెప్పిన స్టోరీ ఇన్ స్పైర్ చేస్తూనే నవ్విస్తుంది కూడా.

' నా తండ్రి కొడుకా ఇన్ని అవార్డులు అందుకున్నావు అసలైన ఆస్కార్ అవార్డు ఎప్పుడు అందుకుంటావ్ అని అడిగేవాడు. దానికి కామెడీ యాక్షన్ మూవీస్ చేసే నాకు వస్తుందా ఏంటి అనుకున్నా. అయితే కొద్దిరోజులకు హాలీవుడ్ డైరెక్టర్, నా ఫ్రెండ్ స్టాలోన్ ఇంటికి వెళ్లా. అక్కడ ఆ అవార్డు చూసి మనసుపడ్డ. ముద్దు పెట్టుకున్నా. స్మెల్ చూసా. ఇలాంటిది నాకు కూడా కావాలని అప్పుడే డిసైడ్ అయ్యా. కానీ 200కు పైగా సినిమాలు చేసి.. బొక్కలన్నీ విరాగ్గొట్టుకుంటే కానీ కుదరలేదు ' అని చెప్పాడు. కాగా ఆయన ఈ అవార్డును 56 ఏళ్ల వయసులో తీసుకోవడం విశేషం.

Next Story

Most Viewed