- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పారిస్ పారాలింపిక్స్‌కు ఐదు బెర్త్‌లు ఖరారు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : పారిస్ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు ఐదు బెర్త్‌లు దక్కాయి. స్టార్ పారా షట్లర్లు సుకాంత్ కదమ్, తరుణ్, సుహాస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. విశ్వక్రీడలకు అర్హత సాధించడం సుకాంత్‌కు ఇదే తొలిసారి. పురుషుల ఎస్‌ఎల్ 4 కేటగిరీలో సుకాంత్, తరుణ్, సుహాస్ బెర్త్‌లు పొందారు. అలాగే, మహిళల ఎస్‌ఎల్3 కేటగిరీలో మన్‌దీప్ కౌర్, మిక్స్‌డ్ డబుల్స్ ఎస్ఎల్ 6 కేటగిరీలో నిత్య-శివరాజన్ జోడీ క్వాలిఫై అయ్యారు. ఒలింపిక్ బెర్త్ దక్కడంపై సుకాంత్ కదం సంతోషం వ్యక్తం చేశాడు. ‘కల నెరవేరింది. పారాలింపిక్స్ అర్హత సాధించడానికి చాలా కష్టపడ్డాను. క్వాలిఫై అవడంతోనే కల పూర్తవ్వలేదు. పతకం సాధించి దేశం గర్వపడేలా చేస్తేనే కల పూర్తవుతుంది.’ అని తెలిపాడు. కాగా, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్ పారాలింపిక్స్ జరగనున్నాయి.
Advertisement
Next Story