Gaza : గాజాలో మృతులు 46వేలకు పైనే !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-09 11:32:27.0  )
Gaza : గాజాలో మృతులు 46వేలకు పైనే !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయిల్..హమాస్ ల మధ్య యుద్ధం(War Between Israel and Hamas) మొదలయ్యాక ఇప్పటిదాక గాజా(Gaza)లో 46వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లుగా గాజా ఆరోగ్యశాఖ(Gaza Health Ministry)వెల్లడించింది. 2023ఆక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయిల్ భీకర దాడులు కొనసాగిస్తుంది. గత మూడు రోజుల్లో ఆ దేశ సైన్యం నిర్వహించిన దాడుల్లో 200 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. గడచిన రెండు మూడు రోజుల్లో 200మంది వరకు చనిపోయారు. డిసెంబర్‌లో 1,124 మంది, నవంబర్‌లో 1,170, అక్టోబర్‌లో 1,621 మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టకముందే 15 నెలల నాటి యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుని ఇజ్రాయెల్ బందీలను తిరిగి ఇవ్వాలనే పునరుద్ధరణ నేపథ్యంలో తగ్గాల్సిన ప్రాణనష్టం మరింతగా పెరిగింది. నవంబర్ లో ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని..అయితే హెజ్బోల్లా పాటించడం లేదని ఇజ్రాయిల్ ఆరోపిస్తుంది.

లితాని నది సమీపంతో హెజ్బొల్ల తన బలగాలను ఉపసంహరించుకోలేదని, షరతులను పాటించకపోతే అసలు ఒప్పందమే ఉండదని ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు.మరోవైపు ఇరాన్, లెబనాన్ లు పాలస్తీనాకు సహకరిస్తుండటంతో వాటితో కూడా తరుచు ఇజ్రాయిల్ పరస్పర దాడులకు పాల్పడుతోంది.

Advertisement

Next Story