Breaking: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు

by srinivas |   ( Updated:2024-05-19 15:58:22.0  )
Breaking: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. పోలింగ్ తర్వాత కూడా కార్యకర్తలు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టి ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేశారు. మళ్లీ పునరావృతంకాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

అయితే ఈ ఘటనలకు సంబంధించి కొందరు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల అనుమతి లేకుండా ఓ కార్యకర్తను ఆయన వెంట తీసుకెళ్లారు. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. పోలీసుల విధులకు ఆంటకం కలిగించారని సీఐ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు కేసు కూడా ఫైల్ చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన బావమరిది మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story