- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఎన్నికల రిజల్ట్ చెప్పేసిన వేణుస్వామి.. వారికి ఓటమి తప్పదంటూ బిగ్ బాంబ్
దిశ, ఫీచర్స్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. నటీనటులపై, రాజకీయవేత్తలపై సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతే కాకుండా.. ఆయన చెప్పిన జాతకాలు మాక్సిమమ్ నిజం కావడంతో.. చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయ నేతలు అతన్ని ఫాలో అవుతూ.. ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆయన ఏపీ రాజకీయాలపై పలు సార్లు కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల రిజల్ట్ చెప్పి బిగ్ బాంబ్ పేల్చాడు వేణు స్వామి.
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2014 మాదిరిగానే మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టగా.. అధికార వైసీపీ సింగిల్‌గా కూటమిని ఢీకొట్టింది. ఇరుపార్టీలో హోరాహోరీ ప్రచారం, విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కించారు. అంతే కాకుండా.. ఈసారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతు కూడా బాగా పెరిగింది. దీంతో పిఠాపురంలో పవన్ కల్యాణ్ విన్నింగ్ కన్ఫార్మ్ అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వేణుస్వామి కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు అనేది ఒక్కసారి మాత్రమే కలిసి వస్తుంది. జాతకరీత్యా వారిద్దరి పొత్తు అనేది కేవలం ఒక్కసారికే. ఆ తర్వాత అసలు పని చేయదు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కల్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం మకర రాశి. అందుకే వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ కాదు. అలాగే పవన్ 2017 ప్రారంభమైన శని 2025 వరకు ఉంది. ఇక 2014లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయిక వర్కౌట్ అయింది. కాబట్టి ఈసారి వర్కౌట్ కాదు. అందుకే ప్రస్తుతం వీరి కాంబినేషన్ వల్ల అనుకూలత కంటే ప్రతికూలతే ఎక్కువగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో.. ఏపీ రాజకీయాలో దుమారం లేపుతున్నాయి. అధికారం ఎవరిని వరిస్తుందో అనే టెన్షన్ మరింత పెరిగింది ప్రజల్లో. అయితే.. వేణుస్వామి వ్యాఖ్యలు ఎంత వరకు నిజం అవుతాయో అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సి ఉంది.
Read More..
Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?