నిజాంసాగర్ ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి

by Sridhar Babu |
నిజాంసాగర్ ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి
X

దిశ,నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆయన ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వంద ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అన్నారు. ఆనాడు నిర్మించిన ఇంజనీరింగ్ కళ, నైపుణ్యంకు నిదర్శనం అని కొనియాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారని, ఆయన అకాల మరణంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు.

అప్పటి నుండి పదేండ్లు పాలించిన గత ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ లను వారి సొంత సంబరాలకు మాత్రమే వాడుకున్నారని అన్నారు. పర్యాటక కేంద్రంగా మార్చేందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు గాను తన మిత్రుడు అమెరికాకు చెందిన సైటిస్ట్, ఇంజనీర్ అనుభవం గల స్టివ్ బిల్హెడ్ తో కలిసి ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పూర్తి నివేదికను సమర్పించి ప్రత్యేక నిధులను మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని హామీ నిచ్చారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా పేరు గాంచే విధంగా అభివృద్ధి చేస్తాను అని హామీనిచ్చారు. ఆయన వెంట మండల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, గౌస్ పటేల్, ప్రజా పండరి, గజ్జల రాములు, చిట్యాల నారాయణ, అబ్దుల్ కాలేక్, మెగావత్ మోహన్, చందా ప్రవీణ్ కుమార్, రాము రాథోడ్, గాండ్ల రమేష్, అజరుద్దీన్, రామ కృష్ణ, బుడిమి శ్రీనివాస్, మారెడ్డి వెంకట్ రెడ్డి, జమీల్, మల్లయ్య గారి ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed