- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణం అదే..!
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతి త్వరలో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధమే కారణంగా వారు చెబుతున్నారు. ఇరాన్ దాడులకు ప్రతి దాడిగా ఆ దేశంలో చములు నిల్వలే లక్ష్యంగా దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందనే వార్తా కథనాలు వస్తున్నాయి. ఇరాన్ చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని అగ్ర రాజ్యం అమెరికాతో పాటు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ అలాంటి దాడికి తెగబడితే ఇరాచ్ చమురు నిక్షేపాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి చేసే ఇరాన్ ఇకపై చమురు ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయనేది నిపుణుల మాట. ముఖ్యంగా భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఇక ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు భారీతగా పెరిగినట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. బ్రెండ్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 75 డాలర్ల మార్క్‌ను దాటింది. బెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ సైతం 72 డాలర్లకు చేరింది. వాస్తవానికి ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు పతనమయ్యాయి. అయితే ఈ యుద్ధానికి ముందు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనమయ్యాయి. దీనికి తోడు మన దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనునున్న నేపథ్యంలో చమురు ధరలు తగ్గుతాయని ప్రజలంతా ఆశ పడ్డారు. కానీ తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆయిల్ సరఫరాపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.