- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీకి గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదల
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రంలో టూరిజంకు అనువైన ప్రాంతాలుండటంతో అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుందని నమ్ముతుంది. అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. అటు రాష్ట్ర పర్యాటక శాఖపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్(AP Deputy CM Pawan Kalyan) ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి షెకావత్(Union Minister Shekhawat)ను కలిశారు. టెంపుల్, ఎకో, అడ్బెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకరించాలని కోరారు.
అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman)ను పవన్ కల్యాణ్ కలిశారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తాజాగా పర్యాటకకు నిధులు విడుదల చేశారు. రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సాయం కింద తొలి విడుతగా రూ. 113 కోట్లు విడుదల చేశారు. 2024-25 సంవత్సరానికి ఈ నిధులు విడుదల చేశారు.ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్(State Tourism Minister Kandula Durgesh) తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల ఏర్పాటు చేస్తే రాష్ట్రం నుంచి కాకుండా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకర్షించవచ్చని కందుల దుర్గేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.