- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం పదవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం ఎక్‌నాథ్ షిండే
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మహా యుతి కూటమి ఎవరు ఊహించిన విధంగా భారీ విజయాన్ని అందుకుంది. అయితే గతం లోను ఈ కూటమి అధికారంలోకి ఉన్నప్పటికి.. తాజా ఎన్నికల్లో బీజేపీకీ భారీగా సీట్లు వచ్చాయి. దీంతో మహా యుతి కూటమి నుంచి సీఎం పదవి ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠ గత నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇదే విషయంపై మహా యుతి కూటమిలోని పార్టీలు పలుమార్లు చర్చలు జరిపారు. కాగా ప్రస్తుతం ఈ ఇష్యూ ఢిల్లీ వేదికకు మారింది. ఈ క్రమంలో బీజేపీ కీలక నేతలతో ఈ రోజు సమావేశమైన మాజీ సీఎం ఏక్ నాథ్ షిండ్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
"పీఎం మోడీ, అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు.. ప్రభుత్వ ఏర్పాటుపై నా అభిప్రాయం తెలుసుకున్నారు. ఎన్డీయే అధినేతలుగా మీరు ఏ నిర్ణయం తీసుకున్న నాకు ఆమోదమే అని వారికి చేప్పాను." ప్రభుత్వ ఏర్పాటులో మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని, సీఎం పదవిపై మోడీ, అమిత్ షా నిర్ణయమే అంతిమం అని.. మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే కుండబద్దలు కొట్టారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకిగా తాను ఉండబోనని, బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని, రేపు ఢిల్లీలో మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పేరును ప్రకటిస్తారని షిండే తేల్చి చెప్పారు. దీంతో గత నాలుగు రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు రేపు తెరపడనుండగా.. రాజకీయ విశ్లేషకులు ముందుగానే.. మహారాష్ట్రకు కాబోయే సీఎం ఫడ్నవీస్ అంటు అంచనా వేస్తున్నారు.