ఈవీఎంలతో ట్యాంపరింగ్ ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం : రంగారెడ్డి కలెక్టర్

by Aamani |
ఈవీఎంలతో  ట్యాంపరింగ్ ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం : రంగారెడ్డి కలెక్టర్
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినదని, ఈవీఎంల వినియోగానికి సుప్రీంకోర్టు సమర్థించినదని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని, భారత ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టి వేసిందని, ఈవీఎం ట్యాంపరింగ్ పై పిటిషనర్ చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిందని తెలిపారు.

Advertisement

Next Story