Honda: హోండా నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు లాంచ్.. జనవరి 1 నుంచి బుకింగ్స్ ప్రారంభం..!

by Maddikunta Saikiran |
Honda: హోండా నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు లాంచ్.. జనవరి 1 నుంచి బుకింగ్స్ ప్రారంభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లో గత కొంత కాలంగా విద్యుత్ వాహనాలకు(EV) డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. మన దేశంలో ఓలా ఎలక్ట్రిక్(Ola Electric), ఏథర్(Ather) వంటి కంపెనీలు టూ వీలర్ ఈవీ రంగంలో దూసుకెళ్తుండగా తాజాగా జపాన్(Japan)కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా(Honda) యాజమాన్యంలోని హోండా మోటార్ ఇండియా(Honda Motor India) మొదటి సారి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ రోజు లాంచ్ చేసింది. హోండా యాక్టివా ఈ(Activa e), క్యూసీ 1(QC 1) పేరుతో వీటిని మార్కెట్లో ఆవిష్కరించింది. కాగా తన పాపులర్ మోడల్ యాక్టివా ఈవీని తీసుకొస్తారని కొన్ని నెలల నుంచి రూమర్స్ రాగా.. తాజాగా వాటికి తెరదించింది. ఈ రెండు ఈవీ స్కూటర్లకు సంబంధించిన బుకింగ్స్(Bookings) 2025 జనవరి 1 నుంచి ప్రారంభం అవుతాయని, ధరల వివరాలు కూడా అప్పుడే ప్రకటిస్తామని హోండా వెల్లడించింది.

ఇక హోండా యాక్టివా ఈ స్కూటర్ ను స్వాపబుల్ బ్యాటరీ(Swappable Battery)తో తీసుకొస్తోంది. ఇందులో రెండు 1.5 కిలోవాట్ బ్యాటరీలను అమర్చారు. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 102 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. గంటకు 80 కి.మీ టాప్ స్పీడ్ తో వెళ్లొచ్చు. సేమ్ యాక్టివా డిజైన్ తో వస్తున్న ఈ స్కూటర్లో LED హెడ్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్ విషయంలో స్మాల్ చేంజెస్ చేశారు. స్టాండర్డ్, స్పోర్ట్స్, ఎకానమీ మోడల్ లలో కస్టమర్లకు కొనుగోలులకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు క్యూసీ 1 స్కూటర్ ను తక్కువ దూరం ప్రయాణించేలా తయారు చేశారు. 1.5 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ(Fixed battery)తో వస్తోంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్(Single Charge)తో 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. 5 ఇంచెస్ ఇన్ స్ట్రుమెంటల్ ప్యానెల్, USB టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed