- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెట్టింగుల్లో భారీగా లాస్.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం..!
దిశ, వెబ్ డెస్క్: దొరికిన చోట అప్పు చేశారు. బెట్టింగుల్లో పెట్టారు. అలా రూ. 30 లక్షల వరకూ పందేలు కాచారు. చివరకు ఒక్క రూపాయి కూడా తిరిగిరాలేదు. దీంతో మనస్థాపం చెందారు. అప్పుల భయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగింది.
గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజారెడ్డి ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డారు. సొంత డబ్బులే కాకుండా అప్పులు చేసి మరి బెట్టింగుల్లో పెట్టారు. అలా రూ. 30 లక్షలు పోగొట్టుకున్నారు. అప్పులపాలు కావడంతో నాగరాజారెడ్డి కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. నాగరాజారెడ్డితో పాటు కుమారుడు దినేశ్, భార్య జయంతి, కుమార్తె సునీత ఇంట్లోనే పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.