Microsoft: హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి.. 48 ఎకరాల్లో భారీ మైక్రోసాఫ్ట్ క్యాంపస్

by Disha Web Desk 1 |
Microsoft: హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి.. 48 ఎకరాల్లో భారీ మైక్రోసాఫ్ట్ క్యాంపస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ రంగంలో దేశంలోని ప్రధాన నగరాలను సైతం దాటేసిన హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన కార్యకలాపాలను మరింత విస్తరించబోతోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలంలోని ఎలికట్ట గ్రామంలో రూ.267 కోట్లతో 48 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా ముగిసింది. కాగా, ఈ డాక్యు‌మెంట్ల ప్రకారం మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ (ఇండియా) ఒక్కో ఎకరానికి రూ.5.56 కోట్లు చెల్లించింది. అదేవిధంగా అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో రూ.275 కోట్లతో భూమిని కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Read More...

Big Alert:ఎడ్‌సెట్-2024 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

Next Story

Most Viewed