- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినీతి.. కాంగ్రెస్ డీఎన్ఏలో ఉంది: రాజస్థాన్ సీఎం
దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా బృందంతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కాగా ఈ మీటింగ్‌కు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు. ఎన్నికల సమాయత్తం, బూత్ కమిటీలు, బూత్ స్థాయిలో చేయాల్సిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం భజన్ లాల్ శర్మ మీడియాతో మాట్లాడారు. యూపీఏ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. దేశంలో అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, విభజనవాదం పెరగాడినికి కారణం కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. జూన్ 4న కాంగ్రెస్ సహా విపక్ష కూటమి నేతలకు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు.