పాములు వెంటపడినప్పుడు అనవసరంగా గాబరాపడకుండా .. ఇలా చేయండి..

by Dishafeatures3 |
పాములు వెంటపడినప్పుడు అనవసరంగా గాబరాపడకుండా .. ఇలా చేయండి..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పాములు వెంటపడినపుడు S ఆకారంలో పరుగెత్తాలని చెప్తుంటారు పెద్దలు. అలా చేస్తే అది త్వరగా దిశను మార్చుకోలేదని, ఆ టైంలో ఈజీగా ఎస్కేప్ అవొచ్చని అంటారు. కానీ ఇదంతా ట్రాష్ అంటున్నారు వీటిపై అధ్యయనం చేసిన నిపుణులు. నిజానికి స్నేక్స్ ఏ తీరుగనైన పాకుతాయని.. వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మన జోలికి రావని, వాటి దారిన అవే పోతాయని చెప్తున్నారు.

పాము ఎదురైనప్పుడు అదేదో చేస్తుందనే భయం అస్సలు వద్దు. అది మనల్ని ఏం చేయదు. అనవసరంగా భయపడి గందరగోళంలో ఎటాక్ చేయాలి చూస్తేనే కాటు వేసేందుకు ప్రయత్నిస్తాయి. ఇక వీటికి విజన్ చాలా తక్కువ. దూరంగా ఉండే వస్తువులను క్లారిటీగా చూడలేవు. కాబట్టి ఎదురుగా ఉన్న వ్యక్తులను, వస్తువులను కొద్దిగా వంగి చూసేందుకు ట్రై చేస్తాయి. దీన్ని మనం దాడి చేసేందుకు ప్రయత్నిస్తుందని అనుకుంటాం. మనమే ముందుగా దానిపై వార్ ప్రకటిస్తాం.

ఇక పాములు మనం ఆగ్రహంతో ఉన్నది లేనిది తరంగాల ద్వారా తెలుసుకుంటాయి. ఆ సమాచారానికి అనుగుణంగా రియాక్ట్ అవుతాయి. ఇదంతా పక్కన పెడితే పాము కాటుకు గురైనప్పుడు వెంటనే వైద్య సహాయం అవసరమని గుర్తుంచుకోండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Next Story

Most Viewed