- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ చాలా వీక్‌గా ఉంది.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ చాలా వీక్‌గా ఉందని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ అని బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ప్రధాని తెలంగాణలో 22 సార్లు పర్యటించారని, ఎక్కువ శాతం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారని, అయినా సీఎంగా ఉండి కేసీఆర్ ప్రధాని పర్యటనకు రాలేదని విమర్శించారు. ఆయన గవర్నర్ కార్యాలయానికి ఎన్నడూ మర్యాద ఇవ్వలేదని ఫైరయ్యారు. బీఆర్ఎస్ గురించి ప్రజలకు తెలుసని ఆమె పేర్కొన్నారు.
ఇకపోతే అసత్యపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై అసత్యపు ప్రచారం చేసి కులమతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని తమిళిసై మండిపడ్డారు. రిజర్వేషన్ల ఎత్తివేత అంశపై ఇప్పటికే ప్రధాని, హోంమంత్రి, ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా వివరణ ఇచ్చారని తెలిపారు. రుణమాఫీ ఎలా చేస్తారని, దానికి అంత బడ్జెట్ ఎలా తెస్తారో స్పష్టత ఇవ్వాలని తమిళిసై డిమాండ్ చేశారు. తమ ప్రధాని అభ్యర్థి మోడీ అని, మరి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్ ను యూనియన్ టెర్రిటరీగా చేసే ఆలోచన తమకు లేదని, దీనిపై కేటీఆర్ ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సౌత్ చెన్నైలో తాను గెలుస్తున్నానని, తమిళనాడులో బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసినట్లు తమిళిసై అన్నారు.
Read More...
కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలు! ప్రాజెక్టుపై మరోసారి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు