కొండగట్టు ఆలయంలో చోరీ

by M.Rajitha |
కొండగట్టు ఆలయంలో చోరీ
X

దిశ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం సంచలనం సృష్టిస్తోంది. ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. అన్నదాన సత్రంలో ఈనెల 9న బియ్యం బస్తాలు, ఇతర సామగ్రి తీసుకు వెళ్ళడం ఆలయ అధికారులు సీసీటీవి ఫుటేజీ ద్వారా గమనించారు. ఆ వ్యక్తి అన్నదాన సత్రంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ రాములుగా గుర్తించారు. ఈ వ్యవహారంపై రాములుకు మెమో జారీ చేసి.. విచారణకు ఆదేశించారు. నివేదిక అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed