కన్నడ బిగ్ బాస్ కు బిగ్ షాక్!

by M.Rajitha |
కన్నడ బిగ్ బాస్ కు బిగ్ షాక్!
X

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ బిగ్ బాస్ కు భారీ షాక్ ఇచ్చారు పోలీసులు. ప్రస్తుతం టెలీకాస్ట్ అవుతున్న కన్నడ బిగ్ బాస్ లో 'స్వర్గం-నరకం' అనే కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం 'నరకం'లో ఉన్న కంటెస్టెంట్స్ ఆహారంగా గంజి మాత్రమే ఇచ్చారు. బాత్రూమ్ కి వెళ్ళాలి అంటే 'స్వర్గం'లో ఉన్నవారి అనుమతి తీసుకోవాలి. ఇది ఆ షోలో పార్టీసిపెట్ చేస్తున్న స్త్రీల ప్రాథమిక హక్కులకు భాగం అంటూ పోలీసులు కర్ణాటక మహిళా కమిషన్ కు లేఖ రాశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన మహిళా కమిషన్ బిగ్ బాస్ నిర్వాహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోమంటూ పోలీసులను ఆదేశించగా.. ఆదివారం బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కాగా ఈ విషయం కన్నడనాట ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Next Story