ఆసియా టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో ‘కాంస్యం’

by saikumar |
ఆసియా టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో ‘కాంస్యం’
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి మహిళల డబుల్స్ జోడీ అహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ డబుల్స్ జోడి చరిత్ర సృష్టించింది.ఆదివారం జరిగిన టోర్నీలో ఈ ద్వయం చారిత్రాత్మక కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ నుంచి మొట్టమొదటి సారిగా ఆల్-ఇండియా మహిళల డబుల్స్ జోడీ విభాగంలో కాంస్యం సాధించిన ద్వయంగా అహికా, సుతీర్థలు నిలిచారు.

ఒలింపిక్స్.కామ్ ప్రకారం.. 1952లో టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో జపాన్‌కు చెందిన యోషికో తనకాతో కలిసి భారత్‌కు చెందిన గూల్ నాసిక్వాలా మహిళల డబుల్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. తాజాగా మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ 15వ ర్యాంకింగ్‌లో ఉన్న అహికా, సుతీర్థ ముఖర్జీలు.. జపాన్‌కు చెందిన ప్రపంచ 33వ ర్యాంకర్ ద్వయం మివా హరిమోటో, మియు కిహారా చేతిలో 3-0 (4-11, 9-11, 9-11)తో ఓడిపోయారు. కాగా, ఈ పోటీలో ఓడిన సెమీ ఫైనలిస్టులకు ఆసియా టేబుల్ టెన్నిస్ మేనేజ్మెంట్ కాంస్య పతకాలను అందజేసింది.

Advertisement

Next Story