- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా జయవర్ధనే..
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ్‌లో ముంబై జట్టు ‘ప్లే ఆఫ్స్’ కూడా చేరలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తిగా ఉన్న ముంబై యాజమాన్యం హెడ్‌కోచ్ మార్క్ బౌచర్‌పై వేటు వేస్తూ.. మహేళ జయవర్థనేకు మళ్లీ పగ్గాలు అప్పగించింది. ముంబైకి 2017 నుంచి 2022 వరకూ హెడ్‌కోచ్‌గా పనిచేసిన జయవర్ధనే.. మరోసారి జట్టుకు ట్రోఫీని అందించే పనిలో నిమగ్నం కానున్నాడు. ఈ విషయాన్ని ఆదివారం ముంబై యాజమాన్యం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది.
‘ముంబైతో నా ప్రయాణం ఎల్లప్పుడూ చాలా గొప్పది. 2017లో ప్రతిభగల కుర్రాళ్లను వెలికితీసి వాళ్లతో అత్యుత్తమ క్రికెట్ ఆడేలా చేశాం. ఇప్పుడు మళ్లీ హెడ్‌కోచ్‌గా నియామకం అయ్యాను. ముంబైని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను. ముంబై గత చరిత్రను కొనసాగిస్తాం. కొత్త సవాల్‌ను స్వీకరించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని జయవర్ధనే పేర్కొ్న్నారు. కాగా, 2017 నుంచి 2022 మధ్య రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబై బౌలింగ్ కోచ్‌గా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఇటీవల ఎంపికయ్యాడు.