శ్రీ ఉమామహేశ్వర కొండపైకి మిషన్ భగీరథ పైప్ లైన్..

by Sumithra |
శ్రీ ఉమామహేశ్వర కొండపైకి మిషన్ భగీరథ పైప్ లైన్..
X

దిశ, అచ్చంపేట రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని శ్రీ ఉమామహేశ్వరం కొండపైకి రంగాపూర్ గ్రామం నుండి మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ ఏర్పాటు కొరకు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర దేవాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అదేవిధంగా దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాస చారి, ప్రజాప్రతినిధులు, అధికారులు, దేవస్థానం పాలకమండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు భక్తులు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed