మీ ఊహలకు మించి ‘సలార్-2’ ఉంటుంది.. అంచనాలు పెంచుతున్న ప్రశాంత్ నీల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-12-22 08:04:42.0  )
మీ ఊహలకు మించి ‘సలార్-2’ ఉంటుంది.. అంచనాలు పెంచుతున్న ప్రశాంత్ నీల్ కామెంట్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గత ఏడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘సలార్’(Salar). దీనికి సీక్వెల్‌గా ‘సలార్-2’ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే నేటికి ‘సలార్’ విడుదలై ఏడాది పూర్తి కావడంతో ప్రశాంత్ నీల్(Prashant Neel) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఎక్కడో ‘కేజీఎఫ్-2’(KGF-2) ఛాయలు కనిపించాయి. అయితే ‘సలార్-2’(Salar-2) సినిమాను మాత్రం నా కెరీర్‌లో బెస్ట్ మూవీగా తీస్తాను.

నేను ఇందులో పెట్టిన రచన బహుశా నా ఉత్తమ రచనలలో ఒకటి. ప్రేక్షకులు ఊహించిన దానికి మించి ఉంటుంది. అలా ఉండాలని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాను. నా జీవితంలో చాలా తక్కువ విషయాలపై నాకు నమ్మకం ఉంది. ‘సలార్-2’ అందులో ఒకటి. నిస్సందేహంగా ఈ సినిమా నా ఉత్తమ రచనలలో ఒకటి అవుతుందని భావిస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రేక్షకుల్లో ‘సలార్-2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed