పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌కు అవమానం : ఎమ్మెల్యే రామచంద్రనాయక్

by Aamani |
పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌కు అవమానం : ఎమ్మెల్యే రామచంద్రనాయక్
X

దిశ,డోర్నకల్: భారత రాజ్యాంగాన్ని బీజేపీ అనగదొక్కాలని చూస్తుందని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని ములకలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.నేటికీ పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం నెరవేరలేదని అన్నారు.

ప్రధానికి బడా బాబులే ముఖ్యమన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారన్నారు.అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షేమ,అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా అక్కసు వెలగకుతున్నారని అన్నారు.కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు జగదీష్ నాయక్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసం శేఖర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed