- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Snake : పాము విషాన్ని తీసేసే ఈ మొక్క గురించి తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది పాములను ( Snakes) చూసి భయపడి పారిపోతుంటారు. అయితే, వర్షాకాలం అయినా శీతాకాలం అయినా పాములకు చాలా ఇష్టమని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి బయట ఎక్కువగా తిరుగుతుంటాయి. పాము కాటేసిన వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి .. లేదంటే చనిపోయే అవకాశం ఉంది. అయితే, పాము విషం శరీరమంతటా వ్యాపించకుండా .. చూసుకోవాలి.
పాము విషం శరీరానికి వ్యాపించకుండా ఉండేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అయితే, వాటిలో ఏవి పనిచేస్తాయో తెలియదు.. కానీ ఆయుర్వేదంలో అనేక చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ బోడ కాకరకాయ మొక్క గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. దీనిని కంకరోల్, కత్రాల్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఎక్కువగా వేడి, తేమతో కూడిన ప్రదేశాలలో మాత్రమే పెరుగుతుంది. బోడ కాకరకాయలు దొరికినప్పుడల్లా ఎక్కువసార్లు తింటూ ఉండాలి. ఇది చాలా రుచికరమైన కూరగాయ. ఈ కూరగాయ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఎవరికీ తెలియదు.
ఈ మొక్క వేరుకు ఎన్నో విషాలను కూడా పోగొట్టే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తికి బోడ కాకరకాయ వేరును వాడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీని కోసం బాగా ఎండిన వేరును తీసుకుని గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకోవాలి. ఎవరైనా పాము కాటుకు గురైతే, ఒక గ్లాస్ పాలలో ఒక టీ స్పూన్ ఈ పొడిని వేసి బాగా కలిపి అతనికి తాగించండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.