విశాఖ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-03-21 10:38:24.0  )
విశాఖ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అధికారులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో అమరావతి(Amaravati) సచివాలయంలో శుక్రవారం మంత్రి నారాయణ(Minister Narayana) సమీక్ష నిర్వహించారు. విశాఖ మాస్టర్ ప్లాన్‌(Visakhapatnam Master Plan)లో మార్పులు, చేర్పులపై చర్చించారు. సిటీలో మెట్రో రైల్(Metro Rail) పొడిగింపు అంశాన్ని సైతం సమీక్షలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. విశాఖ టీడీఆర్ బ్రాండ్ల(Visakhapatnam TDR Brands)ను త్వరగా జారీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ మాస్టర్ ప్లాన్‌లో చాలా అవకతవకలు జరిగాయని, 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తామని చెప్పారు. మే నెలలో మెట్రో రైల్ టెండర్ల పక్రియ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో టీడీఆర్ బ్రాండ్లలోనూ అక్రమాలు జరిగాయన్నారు. విశాఖలో 600కు పైగా టీడీఆర్ బ్రాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. భోగాపూరం ఎయిర్ పోర్టుకు రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Advertisement
Next Story