పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేది ఎవరు..?

by Sumithra |   ( Updated:2024-12-22 09:30:51.0  )
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేది ఎవరు..?
X

దిశ, తలకొండపల్లి : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి విద్యార్థుల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే, గ్రామీణ ప్రాంతాలైన, రూరల్ ఏరియాలు అయినా గిరిజన తండాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మాత్రం అత్యంత దీన స్థితిలో కొనసాగుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యావంతుడైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులతో ఎప్పటికీ అప్పుడు రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి దిశగా వెళ్లడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచిస్తున్న కింది స్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తలకొండపల్లి మండలంలోని పెద్దూరు తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో చెట్ల పొదలను డంప్ చేశారు.

ప్రతిరోజు ఈ పాఠశాల గ్రౌండ్ లో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఇబ్బందిగా అదేవిధంగా పాఠశాలకు పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పాఠశాల గ్రౌండ్ను చెత్తకుప్పలుగా తయారు చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పాఠశాల ఆవరణలో అంగన్వాడి పాఠశాల కూడా కొనసాగుతుంది. ప్రాథమిక పాఠశాలలో 32 మంది పిల్లలు, అంగన్వాడి పాఠశాలలో 12 మంది చిన్నారులు మొత్తం 44 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల ఆవరణలో అనవసరమైన చెట్ల మదన్లు, కట్టెలను ఇక్కడ వేయడంతో పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటుంటే పాములు తేళ్లు కరిచే ప్రమాదం లేకపోలేదు. అందులో పాములు తేలు ఉండే ప్రమాదం ఉందని అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసి కూడా ఏమీ చేయలేక, ఎవరికి చెప్పిన పట్టించుకున్న పాపాన పోవడం లేదని గిరిజనులు పేర్కొంటున్నారు. స్థానిక అధికారులకు చెప్పినా కూడా వృధాగా ఉన్న చెట్ల పొదలను తొలగించడం లేదని సూచించారు.

అదేవిధంగా ఇదే పాఠశాల గ్రౌండ్లో గత కొన్ని రోజుల క్రితం వాటర్ సంపన్ను నిర్మించి అసంపూర్తిగా వదిలివేశారని, వర్షాకాలంలో ఈ సంపు నిండా నీళ్లు నిండి పాఠశాల గ్రౌండ్లో నుండి బయటికి ప్రవహిస్తున్నాయని, ఈ సంపులో ప్రమాదవశాత్తు విద్యార్థులు పడితే ప్రాణాలు గాలిల్లో కలిసి పోవాల్సిందే, ప్రమాదం ఉందని తెలిసి కూడా అధికారులందరూ చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే, ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టలేరని గిరిజన మహిళలు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాలల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంత మొరపెట్టుకున్న కిందిస్థాయి అధికారుల్లో చలనం లేదు అని చెప్పడానికి ఇది నిల్వెత్తు నిదర్శంగా నిలుస్తుంది. పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన సమయంలో డ్రింకింగ్ వాటర్, మూత్రశాల లేక పిల్లలు, పాఠశాల ఉపాధ్యాయురాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా పెద్దూరు తండా ప్రాథమిక పాఠశాలలోని ప్రమాదంగా ఉన్న నీటి సంపన్ను, చెట్ల కుప్పలను తొలగించి చిన్నారి విద్యార్థి విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story