- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DGP: మహిళలు, చిన్నారుల భద్రత పెరిగింది: డీజీపీ కీలక కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత మహిళలు, చిన్నారుల భద్రత పెరిగిందని తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భరోసా కేంద్రాలు మొదటగా హైదరాబాద్‌లో స్టార్ట్ చేసినట్లు డీజీపీ అన్నారు. తర్వాత ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ప్లాన్ ఉందని తెలిపారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 27 భరోసా కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పనులు నడుస్తున్నాయని, త్వరలోనే అవి కూడా పూర్తి అవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ వల్లే భరోసా కేంద్రాల ఏర్పాటు జరిగిందన్నారు. మహిళలు, చిన్నారులకు సమస్యలు ఉంటే భరోసా కేంద్రానాకి రావొచ్చని సూచించారు. భరోసా కేంద్రంలో న్యాయ నిపుణులు, డాక్టర్ కూడా ఉన్నారని వెల్లడించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా ఉందని స్పష్టం చేశారు. భరోసా కేంద్రాల ఏర్పాటును సుప్రీంకోర్టు కూడా ప్రశంసించిందని వివరించారు. ఇతర రాష్ట్రల అధికారులు సైతం మన భరోసా కేంద్రాలను సందర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు.
సినిమా ప్రమోషన్ కంటే పౌరులు భద్రత ముఖ్యం
సంధ్య థియేటర్ ఘటనపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. వ్యక్తిగతంగా ఎవరికీ తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని తెలిపారు. సినీ హీరో కావొచ్చు.. కానీ పరిస్థితులు అర్థం చేసుకోవాలని కామెంట్స్ చేశారు. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైనది కాదని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదన్నారు. అత్యుత్సహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే పర్వాలేదన్నారు. ఇంటి సమస్య కాబట్టి వాళ్లే సమస్యను పరిష్కరించుకోవాలని డీజీపీ సూచించారు.