- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FPIs: అక్టోబర్‌లో రూ. 58 వేల కోట్లకు పైగా నిధులు ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు
దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని నెలలుగా భారత ఈక్విటీల్లోకి వచ్చిన విదేశీ నిధులు మళ్లీ వెనక్కి వెళ్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ తీవ్రత పెరగడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటం, చైనా మార్కెట్లలో ర్యాలీతో విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా రూ. 58,711 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు సెప్టెంబర్‌లో తొమ్మిది నెలల్లోనే గరిష్ఠంగా రూ. 57,724 కోట్ల పెట్టుబడులు భారత ఈక్విటీలకు వచ్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు స్టాక్ మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. దీనికితోడు అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు కొత్త గరిష్టాల వైపుగా పయనిస్తున్నాయి. గడిచిన వారం వ్యవధిలోనే బ్రెంట్ క్రూడ్ ధర 79 డాలర్లకు చేరింది. మరోవైపు చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలతో అక్కడి స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. దీంతో మన మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారీగా మొత్తం నిధులను వెనక్కి తీసుకుంటున్నారు.