- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరంభ శూరత్వమే.. ప్రారంభించిన మరునాడే మూతపడిన హరిత హోటల్
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పాషిగామ్ వద్ద నిర్మించిన హరిత హోటల్‌ను ప్రారంభించిన మరసటి రోజే మూసివేశారు. రూ.కోటిన్నర వ్యయంతో నిర్మించిన హోటల్ పర్యాటకులకు ఉపయోగపడకుండా మూసి ఉండడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చే నేపథ్యంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా హరిత హోటల్‌ను ప్రారంభించింది. శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి పొందిన కోటిలింగాల శైవ క్షేత్రంతోపాటు గోదావరి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ అందాలను తిలకించేందుకు భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారి సౌకర్యార్థం నిర్మించిన హరిత హోటల్ నిరూపయోగంగా మారింది. హరిత హోటల్ పూర్తి అయితే పర్యాటకంగా కోటి లింగాల బాగా అభివృద్ధి చెందుతుందని ఆశించిన ఈ ప్రాంత వాసుల ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బ్యాలెన్సింగ్ నిధుల విడుదలకు కృషిచేసి హరిత హోటల్‌ను ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. - దిశ, వెల్గటూర్
దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పాషిగామ వద్ద నిర్మించిన హరిత హోటల్‌ను ప్రారంభించిన మరసటి రోజే మూసివేశారు. కోటిన్నర వ్యయంతో నిర్మించిన హోటల్ పర్యాటకులకు ఉపయోగపడకుండా మూసి ఉండడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చే నేపథ్యంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా హరిత హోటల్‌ను ప్రారంభించింది. శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి పొందిన కోటిలింగాల శైవ క్షేత్రంతోపాటు గోదావరి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ అందాలను తిలకించేందుకు భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారి సౌకర్యార్థం నిర్మించిన హరిత హోటల్ నిరూపయోగంగా మారింది. హరిత హోటల్ పూర్తి అయితే పర్యాటకంగా కోటిలింగాల బాగా అభివృద్ధి చెందుతుందని ఆశించిన ఈ ప్రాంతవాసుల ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బ్యాలెన్సింగ్ నిధుల విడుదలకు కృషిచేసి హరిత హోటల్‌ను ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రూ.1.5 కోట్లతో నిర్మాణం
వెల్గటూర్ మండలంలోని పాషిగాం గ్రామంలో ప్రభుత్వ భూమిలో రూ.1.5కోట్ల అంచనా వ్యయంతో గత ఏడాది హరిత హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ హోటల్ కింది ఫ్లోర్ పూర్తి కాగా పై ఫ్లోర్‌లో పని పెండింగ్ ఉంది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఉన్నమేరకే కాంట్రాక్టర్ పని చేసి ఆపేశారు. ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందనే కారణంతో హోటల్‌ను పర్యాటక శాఖకు అప్పగించకుండా కాంట్రాక్టర్ తాళం వేసుకొని బిల్డింగ్‌ను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దీంతో ప్రభుత్వ బందోబస్తులకు వచ్చే పోలీసులకు జిల్లా గార్డులకు ఎన్నికల సిబ్బంది కోసం రెస్ట్ రూములుగా హరిత హోటల్‌ను వినియోగిస్తున్నారు. అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి కొసరు పనులకు వినియోగిస్తుండడంతో పర్యాటకుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
బీఆర్ఎస్ ఖాతాలో వేయడం కోసమేనా?
పర్యాటకులకు వినియోగ పడేలా నిర్మించాల్సిన హరిత హోటల్ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడానికే ఎన్నికల ముందు ప్రారంభించిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు మంత్రిగా ఉన్న కొప్పుల హోటల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించి కోడ్ కూయక ముందే హరిత హోటల్‌ను ప్రారంభించారనే విమర్శలు లేకపోలేదు. సుమారు మూడు నెలలు కావస్తున్నా హోటల్ దిక్కున చూసిన నాథుడే లేకపోవడంతో హోటల్ వెలవెలబోతోంది. హారిత హోటల్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడంపై చూపిన శ్రద్ధ ఆ తర్వాత దాని పెండింగ్ పనిలో పురోగతి నిధుల విడుదల పట్ల చూపలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హోటల్‌లో పనులు పూర్తయినప్పటికీ కింది ఫ్లోర్‌ను పర్యాటకులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు హరిత హోటల్‌ను పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్‌పైనే ఆశలు..
శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పుతూ వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి కొప్పుల ఈ ప్రాంతవాసులకు చివరికి నిరాశనే మిగిల్చారు. కోటిలింగాలకు వచ్చే భక్తులకు పర్యాటకులకు కనీసం మరుగుదొడ్ల వసతి కూడా ఏర్పాటు చేయక పోవడం దురదృష్టకరం. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ తీసుకొని హరితహోటల్ పూర్తి కావడానికి కావాల్సిన బ్యాలెన్సింగ్ నిధులు విడుదల చేయాలని, అలాగే కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల విడుదలకు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.