గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : మంత్రి పొన్నం

by Aamani |
గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : మంత్రి పొన్నం
X

దిశ,కరీంనగర్ రూరల్: ఆధార్ కార్డు వలె రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలంలోని తహిర్ కొండాపూర్ గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.గ్రామంలో పలు నివాసాలకు వెళ్లి అర్హుల వివరాలు నమోదు చేయించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య గుర్తింపు కార్డు, ఫోటో తదితర వాటి వివరాలను స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించుకుందని, ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డు ,హెల్త్ కార్డు పింఛను , ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నయన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాల్లో 288 చోట్ల ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. ఎంత మంది పౌరులున్న కుటుంబం పరంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇందులో కుటుంబ ఆస్తుల వివరాలు ఆర్థిక లావాదేవీలు అడగరని మంత్రి అన్నారు. కుటుంబ సభ్యుల సంఖ్య ఒక గ్రూప్ ఫోటో లాంటి వివరాలు మాత్రమే అడుగుతారన్నారు. అంతే కాకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఆయన గుర్తు చేశారు. ఇంట్లో నలుగురు పిల్లలు ఉండి పెళ్ళిళ్ళు అయి వారికి పిల్లలు ఉన్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తారన్నారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో ఏ మూలనున్న వర్తింపబడతాయని తెలిపారు.

డిజిటల్ గుర్తింపు కార్డు ఫ్యామిలీ పెద్దగా మహిళా మీదనే కార్డు వస్తుందాని, ఈ పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమం లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఇప్పటికే పలు దఫాలుగా మాఫీ చేసిందన్నారు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్నవారికి రూ.2 లక్షల వరకు పూర్తిగా దసరా లోపు మాఫీ అయ్యేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో , ఎంపిడివో ,ఇతర అధికారులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed