డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఫౌజీ’ సెకండ్ షెడ్యూల్‌పై న్యూ అప్‌డేట్!

by sudharani |
డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఫౌజీ’ సెకండ్ షెడ్యూల్‌పై న్యూ అప్‌డేట్!
X

దిశ, సినిమా: ‘సలార్, కల్కి 2898AD’లతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రజెంట్ ఆయన చేతిలో ‘కల్కి-2, సలార్-2, రాజాసాబ్, స్పిరిట్’ వంటి సినిమాలతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ కూడా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. అయితే.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ కంప్లీట్ కాగా.. తాజాగా రెండో షెడ్యూల్‌‌కి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. మొదటి షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొన లేదు.

అలాగే రెండో షెడ్యూల్‌లో కూడా ఆయన ఉండే అవకాశం లేదని టాక్. ఎందుకంటే.. ఈ సినిమాలోని ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో పడ్డాడట దర్శకుడు హనురాఘవపూడి. డార్లింగ్ ప్రజెంట్ 3,4 ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. ఈ టైంలో సమయం వృథా అవ్వకుండా ప్రభాస్ లేని సీన్స్‌ను షూటింగ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నరట డైరెక్టర్. ఇక ప్రభాస్ మాత్రం ‘ఫౌజీ’ షూటింగ్‌లో డిసెంబర్ నుంచి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. చిత్రంలో ప్రభాస్ సోల్జర్‌ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుండగా.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

Next Story